పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం మీరా సాహెబ్ వీధికి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ (49) సౌదీ అరేబియాలో రియాజ్ సిటీలో అబూ సుల్తానానే (కపిల్ ) వద్దా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అబ్దుల్ రెహమాన్ కు ముగ్గురు సంతానం పెద్ద కుమారుడు షేక్ మసూద్ (22)ఎంబీఏ, చదువుతున్నాడు. రెండో కుమారుడు షేక్ సౌద్ (17) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. చిన్న కుమార్తె షేక్ ఫాజిలా(10) ఐదో తరగతి చదువుతుంది. వీరికి మంచి చదువులు చదివించాలని స్థానికంగా ఉంటున్నా పట్టణంలో పని లేక మిత్రుల సహాయంతో అతను సౌదీ అరేబియాకు వెళ్లి రియాజ్ సిటీలో ఒక షాపింగ్ మాల్ లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత మూడు నెలల క్రితం షేక్ అబ్దుల్ రెహమాన్ అనారోగ్యం పాలవడంతో రియాజ్ సిటీలో చికిత్స పొందుతూ 29 జూలై 2024 న మృతి చెందాడు. చిలకలూరిపేట పట్టణంలోని అబ్దుల్ రెహమాన్ భార్య షేక్ ముతేరున్ వారి కుమారులు అబ్దుల్ రహమాన్ ఫోటో పట్టుకొని గత రెండు రోజుల నుండి ఏడుస్తూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆ ఇంట్లో అలానే కూర్చున్నారు. అయితే అబ్దుల్ రెహమాన్ భౌతికాయాన్ని ఇండియాకు పంపడానికి అబూ సుల్తాన్ అనే కపిల్ తన వద్ద ఆర్థిక స్తోమత లేదని ఇండియాకు పంపడానికి సుమారు 5 నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఆ డబ్బును పంపితే గాని షేక్ అబ్దుల్ రెహమాన్ ముతదేహాన్ని ఇండియాకు పంపడం కుదరదని ఫోన్లో తెలియజేశాడు. గత మూడు నెలల నుండి అబ్దుల్ రెహమాన్ అనారోగ్యంతో ఇంటికి రూపాయి కూడా పంపకపోవడంతో ఈ మూడు నెలల నుండి అబ్దుల్ రెహమాన్ కుటుంబ సభ్యులు అప్పోసప్పో చేసి ఎలానో బతుకుతున్నారు.
అయితే పిడుగు లాంటి అబ్దుల్ రెహమాన్ మృతి వార్త తెలియటంతో గత రెండు రోజుల నుండి ఆయన మృతదేహం ఎలా తెచ్చుకోవాలని బాధపడుతూ 31వ తేదీన స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావును సంప్రదించగా పత్తిపాటి పుల్లారావు లోకేష్ కు ఈ విషయాన్ని వివరించారు. అయితే అబ్దుల్ రెహమాన్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపించి వెంటనే అబ్దుల్ రెహమాన్ మృతదేహాన్ని తీసుకొస్తే తాము సాంప్రదాయబద్ధంగా ముస్లిం పద్ధతుల ప్రకారం ఖననం చేస్తామని వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతంతో మీడియాకు తెలియజేశారు.