అమ్మ... నాన్నని ఇక్కడికి తీసుకురారా అంటూ ఆ తల్లిని 10 సంవత్సరాల తన కూతురు షేక్ షాహిద అడుగుతుంటే ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. చిలకలూరిపేట పట్టణంలోని మీరా సాహెబ్ వీధికి చెందిన అబ్దుల్ రెహమాన్ (49) గత నెల 29వ తేదీన సౌదీ అరేబియాలోని రియాజ్ సిటీలో మృతి చెందాడు. అతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. కూతురు పుట్టినప్పటి నుండి ఆర్దిక పరిస్థితి బాలేక కనీసం కూతుర్ని కూడా స్వయంగా చూడలేకపోయాడు. అయితే ఈ నెల ఒకటో తేదీన పిడుగు లాంటి వార్త ఒకటి అబ్దుల్ రెహమాన్ కపిల్ తెలియజేశాడు. అబ్దుల్ రెహమాన్ సౌదీలో మృతి చెందాడని చెప్పడంతో ఆ కుటుంబం ఆ చుట్టుపక్కల ప్రాంతం శోకసముద్రంలో మునిగిపోయిన విషయం తెలిసింది.
అయితే సౌదీ నుండి తన భర్త మృతదేహాన్ని తెప్పించాలని విలేకరుల ద్వారా ప్రజా ప్రతినిధులను ఆ కుటుంబం కోరడంతో ఈనెల రెండవ తేదీన ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ నేత మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ అబ్దుల్ రెహమాన్ పార్థివ దేహాన్ని తన స్వగ్రామానికి తెప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావును కలిసి తమగోడు వెళ్ళబోసుకున్నారు. అబ్దుల్ రెహమాన్ మృతదేహాన్ని తెప్పించాలని తన పార్టీవా దేహానికి తాము స్వయంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే ఎంబసీవారు ఎంపీ యొక్క విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారు. సౌదీ అరేబియా నుండి తన మృతదేహాన్ని తన స్వగ్రామైన చిలకలూరిపేట తేవడానికి అన్ని అధికారిక పత్రాలు పూర్తి చేశారు. గత రెండు రోజుల క్రితం సౌదీ అరేబియాలోని ఎంబసీ వారు అబ్దుల్ రెహమాన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సౌదీ అరేబియా నుండి అబ్దుల్ రెహమాన్ మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎంబసీకు ఫండ్ రిలీజ్ చేయలేదని ఇది కొంత కాలయాపంతో కూడుకున్న పనిని తెలిపారు. సౌదీ అరేబియా లో ఉన్న కపిల్ మాట్లాడుతూ ఆయన మృతి చెంది రెండు వారాలు అయిందని అందువల్ల సౌదీ అరేబియా లోనే ఖననం చేస్తానని వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి సౌదీ అరేబియా పంపాలని ఫోన్ ద్వారా కోరారు.
దీంతో కథ మళ్ళీ మొదటికి రావడంతో తన భర్తను చూసుకుంటానో లేదో అని ఒక భార్య.... తమ నాన్న చివరి చూపు లభిస్తుందో లేదో అని ఇద్దరు కుమారులు.... పుట్టినప్పటి నుండి నాన్నను స్వయంగా చూడలేని కూతురు... ఇలా నలుగురు నరకయాతన అనుభవిస్తూ చివరి చూపు కోసం తెలిసినోళ్లందరి వద్దకు వెళ్లి ఎలాగైనా అబ్దుల్ రెహమాన్ పార్థీవదేహం ఇండియాకు రప్పించేలా చిలకలూరిపేటలోని స్వగ్రామంలో ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేలా చేయాలని కాళ్ళ వేళ్ళ పడుతున్నారు. ఇప్పుడైనా అబ్దుల్ రెహమాన్ మృతదేహం లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు తమ కుటుంబ సభ్యులు ఖననం చేసుకునేలా చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే...!?