చిలకలూరిపేట ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు అష్ట కష్టాలు తప్పడం లేదు. జాతీయ రహదారికి ఆనుకొని చిలకలూరిపేట బస్ డిపో ఉండటం వలన ప్రకాశం పల్నాడు జిల్లాలకు కానుకుని అనేకమంది ఇక్కడినుండే ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. అయితే గతంలో చిలకలూరిపేట డిపోలో చిలకలూరిపేట నుండి గుంటూరు వెళ్ళటానికి మెట్రో బస్సులను ఏర్పాటు చేసి గంటకు రెండు బస్సులు చొప్పున ట్రిప్పులు ఏర్పాటు చేశారు. దాంతో ప్రయాణికులు ఎక్కువ శాతం ఉద్యోగస్తులు గుంటూరు వెళ్ళటానికి అనువుగా ఉండేది.
మెట్రో బస్సులు ఏమయ్యాయి
చిలకలూరిపేట డిపోలో చిలకలూరిపేట నుండి గుంటూరుకు వెళ్లే ఆరు మెట్రో బస్సులను సుమారు ఆరు నెలకి తో ఉన్నతాధికారుల ఆదేశాలతో విజయవాడకు పంపడం జరిగింది. అప్పటినుండి మెట్రో బస్సులు లేకపోవడం వలన చిలకలూరిపేట నుండి గుంటూరుకు ప్రయాణం చేసే ప్రయాణికులకు అష్ట కష్టాలు తప్పట్లేదు గంటల తరబడి బస్టాండ్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండకు బస్సులేవి !?
రాష్ట్రవ్యాప్తంగా పండుగ నిర్వహించే కోటప్పకొండ తిరునాళ్లకు లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా కోటప్పకొండ విరాజిల్లుతుంది. చిలకలూరిపేట నుండి కోటప్పకొండకు 16 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అయితే రాష్ట్ర నుండి ప్రయాణికులు కోటప్పకొండ కు వెళ్లాలంటే చిలకలూరిపేట నుండి ఆటోలే దిక్కు. చిలకలూరిపేట నుండి కోటప్పకొండకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన గాని ఒక బస్సు కూడా నడపకపోవడం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యనికి నిదర్శనం. గతంలో కోటప్పకొండకు ఉదయం సాయంత్రం రెండు ట్రిప్పులు ఏర్పాటు చేశారు. నేటి అధికారుల పుణ్యమా అని ఆ బస్సులను కూడా ఎత్తివేశారు. చిలకలూరిపేట నుండి కోటప్పకొండ వెళ్లే మార్గంలో పోతవరం, మద్దిరాల, ఎడవల్లి, ఈటి గ్రామాల ప్రజలు ఈ బస్సులు నుండే ప్రయాణం చేసేవారు. కానీ నేడు ఆటోల్లో వెళ్లి రోడ్డు ప్రమాదాలకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది.
కొన్ని గ్రామాలకు బస్సులే లేవు
నాదెండ్ల మేజర్ మండలం గా ఉంది. నాదెండ్ల నుండి తూబాడుకు వెళ్లాలన్న, చిలకలూరిపేట నుండి నాదెండ్ల తుబాడుకు వెళ్లాలన్న గతంలో నామాత్రంగా బస్సులు ఉండేవి.
పెదనందిపాడుకు గతంలో ఆరు బస్సులు ఉన్నాయి. అయితే నేడు వాటిని కుదించి రెండు బస్సులు మాత్రమే ఏర్పాటు చేశారు.
అలానే పూనూరుకు మూడు బస్సులు బదులుగా రెండు బస్సులు కేటాయించడంతో బస్టాండ్లో గంటలు తరబడి ప్రయాణికులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
20 మంది సిబ్బంది లేరు
గత నాలుగు నెలల్లో చిలకలూరిపేట ఏపీఎస్ఆర్టీసీ డిపోలో పనిచేసే సిబ్బంది సుమారు 20 మంది వరకు రిటైర్ అయ్యారు. సిబ్బంది కొరతతో అనేకమంది ఓవర్ డ్యూటీ లు చేయటం తగినంత సిబ్బంది లేకపోవడం వలన చిలకలూరిపేట డిపోలో పనిచేసే సిబ్బంది అధిక డ్యూటీ లతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. డిపోకు ప్రధానమైన
సీనియర్ ట్రాఫిక్ మేనేజర్ ను మూడు నెలలుగా ఇక్కడ నియమించకపోవడం వలన ఏపీఎస్ఆర్టీసీ చిలకలూరిపేట డిపోలో ఇటు ప్రయాణికులకు ఇటు సిబ్బందికి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లండి
చిలకలూరిపేట ఏపీఎస్ఆర్టీసీ లో కొన్ని ప్రాంతాలకు బస్సులు ఎత్తివేయటం, కొన్ని ప్రాంతాలకు బస్సులు కుదించడం, సిబ్బంది కొరత తదితర విషయాలపై స్థానిక ప్రజాప్రతినిధి జిల్లా అధికారులతో మాట్లాడి ప్రయాణికుల ఇబ్బంది లేకుండా చేయాలని చిలకలూరిపేట ప్రయాణికులు కోరుకుంటున్నారు.