ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న తిరుమల స్పిన్నింగ్ ఎదురుగా తెల్లవారుజామున 3:30 గంటలకు ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మరియు గ్రామమునకు చెందిన ఇద్దరు డ్రైవర్లు కాకినాడ యాచర్స్ వారి ద్వారా నెల్లూరు వెళ్లి రొయ్యల పెంపకం కొరకు రొయ్యల పిల్లల శాంపిల్స్ తీసుకుని వస్తూ ఉండగా తిరుమల స్పిన్నింగ్ మిల్లు వద్ద రాగా AP 39BM 7126 నంబరు గల ఎర్తిగా కారు కుడివైపు గల వెనక టైరు పంచర్ పడగా హైవే పక్కన ఆపి పంచర్ వేసుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వాహనము వేగంగా వచ్చి గుద్దేసి వెళ్ళగా వడల కృష్ణ, అను అతను అక్కడికక్కడే చనిపోగా రవి కిషోర్, అను అతను చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందారు. యడ్లపాడు ఎస్ఐ వి బాలకృష్ణ గుద్దేసి వెళ్లిపోయిన వాహనం గురించి తిమ్మాపురం హైవే పై ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.
September 15, 2024
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE