పల్నాడు జిల్లా ఎస్పిని కలిసిన చిలకలూరిపేట సిటీ కేబుల్ వ్యాపారులు సోమవారం కలిశారు.
మాజీమంత్రి విడుదల రజిని ప్రధాన అనుచరులు నాదెండ్ల వైసీపీ జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,ఆరేకూటి నరసారెడ్డి ఇరువురిపై ఫిర్యాదు చేశారు. తమ కేబుల్ వ్యాపారాన్ని బెదిరించి పోలీస్ స్టేషన్లో పెట్టి మరీ ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపణ చేశారు.
గత ఇరవై ఏళ్ళుకు పైగా కేబుల్ వ్యాపారంలో ఉన్నామన్న వెంకట కోటేశ్వరరావు.
మాజీమంత్రి విడదల రజిని అండతో అనేక ఇబ్బందులు పెట్టాడన్న బాధితులు.
తనపై లేనిపోని తప్పుడు కేసులు బనాయించారని కోటేశ్వరరావు ఆరోపణ చేశారు.
జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు వలన తనకి కోటి యాబై లక్షల నష్టం వాటిల్లిందని ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని వేడుకొన్న బాధితుడు చింతకాయల కోటేశ్వరరావు.