చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ ఎవరు అనేది వైసిపి కార్యకర్తల మదిలో తొలుస్తున్న ప్రశ్న. గతంలో మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి ఉండగా గత ఎన్నికల్లో విడదల రజినీకు ఆ బాధ్యత అప్పగించిన తరువాత ఐదు సంవత్సరాలు ఆమె ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గం వైసిపి పార్టీ నడిచింది. అయితే విడదల రజనీకు గుంటూరు టికెట్టు కేటాయించడంతో చిలకలూరిపేటలో వరుస కష్టాలు మొదలయ్యాయి. వైఎస్ఆర్సిపి అధిష్టానం మల్లెల రాజేష్ నాయుడును చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జిగా కేటాయించి కొద్ది రోజుల్లోనే మరలా చిలకలూరిపేటకు గుంటూరుకు చెందిన నగర మేయర్ కావటీ మనోహర్ నాయుడును ఇన్చార్జితో పాటు అభ్యర్థిగా నియమించారు. ఈ ఎన్నికల్లో మనోహర్ నాయుడు చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఘోరంగా ఓటమి చెందారు.
అయితే ప్రస్తుతం చిలకలూరిపేట నియోజకవర్గానికి ఎవరు ఇన్చార్జిగా ఉండి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని ప్రశ్నలు అనేకమంది కార్యకర్తలకు తోలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఎన్నికల ముందు చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ కి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి నా తమ్ముడు స్నేహితుడు కావటి మనోహర్ నాయుడు చిలకలూరిపేట లోనే ఇల్లు కట్టుకొని ఉంటాడని బహిరంగంగా చెప్పారు.
అయితే ప్రస్తుతం జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మనోహర్ నాయుడు ఓటమి చెందడంతో ఈ వారం రోజుల్లో చిలకలూరిపేటకు వచ్చిన దాఖలాలు లేవు. గుంటూరు నగర మేయర్ గా ఉంటున్న మనోహర్ నాయుడు చిలకలూరిపేటకు వచ్చి పీకల్లోతు కష్టాల్లో ఉన్న వైఎస్ఆర్సిపి కి సారధ్య బాధ్యతలు వహించి చిలకలూరిపేటలో ఇల్లు కట్టుకొని ఉంటాడా అని అనుమానాలు కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు కలుగుతూనే ఉన్నాయి.
చిలకలూరిపేటలో వైఎస్ఆర్సిపి పార్టీకి పూర్తిస్థాయిలో ఇన్చార్జిని కేటాయించాలని అనేకమంది కోరుకుంటున్న గత కొద్ది నెలలుగా వైసీపీలో ఉన్న డిస్టబెన్స్ వల్ల ఎవరు చిలకలూరిపేట వైసిపి పార్టీని నడిపిస్తారనేది అంతుబట్టని ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ ఎమ్మెల్సీ మరీ రాజశేఖర్ కు చిలకలూరిపేట బాధ్యతలు అప్పజెప్తే బాధ్యతలు తీసుకోవడానికి ఆయన ముందుకు వస్తారా లేదా అని కూడా వైసిపి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
గతంలో పార్టీ గెలిచినప్పుడు మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని మర్రి రాజశేఖర్ కు మొండి చేయి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మే నెలలో ఎన్నికల ముందు చిలకలూరిపేట కు వచ్చి జగన్మోహన్ రెడ్డి మనోహర్ నాయుడును ఒకపక్క అనిల్ కుమార్ యాదవ్ను మరోపక్క నించోబెట్టుకొని మనోహర్ నాయుడు, అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించండి అని అన్నారే తప్ప మర్రి రాజశేఖర్ను ముందుకు తీసుకురాలేదు. మర్రి రాజశేఖర్ ముందుకు వస్తే మంత్రి పదవి ఏం చేశావు జగన్ అని అడుగుతారని సంశయంతో మర్రి రాజశేఖర్ను వెనుక వరుసలో వుంచారు జగన్మోహన్ రెడ్డి. చిలకలూరిపేట నియోజకవర్గంలో మరి ఎవరు వైసీపీకి సారధ్య బాధ్యతలు వహిస్తారో వేచి చూడాల్సిందే..