ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందుకున్న ఒక వృద్ధురాలు పెన్షన్ అందుకున్న పది నిమిషాల్లోనే మృతి చెందిన సంఘటన చిలకలూరిపేటలో జరిగింది. పూర్తి వివరాల ప్రకారం చిలకలూరిపేట పట్టణంలోని 25 వ వార్డు పాటిమీద నివసిస్తున్న పమిడి కోటేశ్వరమ్మ (82) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. అయితే సోమవారం ఉదయం సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు పెన్షన్ అందజేయడానికి వచ్చినప్పుడు సర్వర్ పనిచేయలేదు. మరలా సుమారు ఒంటిగంట సమయంలో సచివాలయ సిబ్బంది మరియు టిఎన్టియుసి నియోజకవర్గ అధ్యక్షులు భవనం శ్రీనివాసరావు టిడిపి కార్యకర్తలు వెళ్లి పమిడి కోటేశ్వరమ్మకు 7 వేల రూపాయల పెన్షన్ను అందజేశారు. తాను పెన్షన్ అందుకున్న పది నిమిషాల్లో మృతి చెందింది. దీంతో వార్డులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 7000 రూపాయలను చేతిలో తీసుకొని చూసుకొని తన ప్రాణాలు విడిచిందని చుట్టుపక్కల వారు చర్చించుకుంటున్నారు.
చిలకలూరిపేటలో విషాదం... 7000 పెన్షన్ అందుకునీ పది నిమిషాల్లోనే మృతి చెందిన వృద్ధురాలు