నూతన సంవత్సరం రోజు చిలకలూరిపేట ఆనుకొని మార్టూరు మండలం రాజుపాలెం డొంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక మహిళకు తీవ్ర గాయాలయి విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకారం బాపట్ల జిల్లా మార్టూరు వైపు వెళుతున్న ముగ్గురు వ్యక్తులు లారీని డికొనడంతో ఈ ప్రమాదం జరిగిందని 108 సిబ్బంది ప్రాథమిక సమాచారం తెలిపారు. విజయనగరంకు చెందిన కొల్లి రాంబాబు, విజయవాడకు చెందిన పల్లెపు గోపి, కొల్లి ఉమా ముగ్గురు కలిసి బైక్ పై మార్టూరు జాతియ రహదారి వైపు వెళుతున్నారు. అయితే లారీ వీరిని ఢీకొందా? లారీ నీ వీరు ఢీకొన్నారా అనేది మాత్రం పూర్తి సమాచారం తెలియలేదు. ఈ ప్రమాదంలో విజయనగరం చెందిన కొల్లి రాంబాబు, విజయవాడకు చెందిన పల్లపు గోపి అక్కడికక్కడే మృతి చెందారు. కొల్లి ఉమా అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో 108 సిబ్బంది చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం వేరే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. 108 సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఈ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.
నూతన సంవత్సరం రోజున విషాదం....ఇరువురు మృతి, ఒకరి పరిస్థితి విషమం