ఈపూరు:బాలికలు చదువుతోపాటు చట్టాలపై అవగాహన చేసుకుని ధైర్యంగా ముందుకు సాగాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ కె చిన్నమ్మాయి అన్నారు. మంగళవారం మండలంలోని ముప్పాళ్ళ అంగన్వాడీ కేంద్రం నందు కిశోరి వికాసం వేసవి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి శిక్షణ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కె చిన్నమ్మాయి పాల్గొని మాట్లాడుతూ కిశోర బాలికలు వ్యక్తిగత శుభ్రత పాటించి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. శిక్షణ కార్యక్రమం మే 2 నుంచి జూన్ 10వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిక్షణా కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారంజరుగుతుందన్నారు.
కిశోర బాలికల సాధికారత అందరి బాధ్యత అని,బాలికలు చిన్ననాటి నుంచే దృఢంగా ఉండాలన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. కిషోర్ బాలికలకు వ్యక్తిగత రుతు స్రావా పరిశుభ్రత లైంగిక వేధింపుల నుండి రక్షణ బాల్యవివాహాలను అరికట్టుట మానవ అక్రమ రవాణా ఆత్మరక్షణ నైపుణ్యం ఉపాధి లింగ వివక్షత గురించి విషయాలను తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కే సీతా కుమారి ఎస్ వెంకటమ్మ ఎస్ బెంజమ్మ పి చౌడేశ్వరి పీ మెహమూధ గర్భిణీలు బాలింతలు , బాలికలు అంగన్వాడి ఆయాలు తదితరులు పాల్గొన్నారు.