బొల్లాపల్లి:కూటమి ప్రభుత్వం పశుపోషకుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తూ చేయూత నిస్తున్నట్టు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మండల కేంద్రమైన బొల్లాపల్లి లో శుక్రవారం పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో పశువుల దాణాను ఎమ్మెల్యే జీవీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాణాలో 25 శాతం మాంసకృత్తులు ఉంటాయని, వేసవిలో వీటి ద్వారా పాల దిగుబడి, వెన్న శాతం తగ్గకుండా ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు పల్నాడు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కే కాంతారావు సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల వీపూరు వైద్యాధికారి డాక్టర్ పి శ్రీనివాసమూర్తి మండల ప్రజా ప్రతినిధులు మండల పశు వైద్యాధికారులు పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ చీఫ్ విప్