వినుకొండ:- మండలం అందుగుల కొత్తపాలెం గ్రామంలో జూలై 31 న తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగి బంగారుపు వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సిఐ శోభన్ బాబు అధ్వర్యంలో ఎస్ఐ లు స్వర్ణలత, షమిర్ భాషా లు తమ సిబ్బందితో చోరీ కేసును 10 రోజుల్లో చేధించారు...
తెనాలి చెంచుపేట కు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 17.5 (139 గ్రాములు) సెవర్ల బంగారుపు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు... వారిని శనివారం కోర్టులో హాజరు పరిచినట్లు సిఐ శోభన్ బాబు తెలిపారు... ఈ సంధర్భంగా కేసు ను కొద్ది రోజుల్లోనే చేదించిన సిబ్బంది ని సిఐ అభినందించారు.