నవంబర్ 9, 2025, రెండో శనివారం చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లోని పలు ప్రాంతాల్లో కరెంటు ఉండదు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ విద్యుత్ అంతరాయం కొనసాగుతుంది. సబ్ స్టేషన్లలో మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యుత్ శాఖ తెలిపింది.
విద్యుత్ అంతరాయం ఉండనున్న ప్రాంతాలు
చిలకలూరిపేట టౌన్: టౌన్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు.
చిలకలూరిపేట రూరల్ మండలం: వేలూరు, కుక్కపల్లివారిపాలెం, పంగుళూరివారి పాలెం, తుర్లపాడు, సందేపూడి, పసుమర్రు, బొప్పూడి, కావూరులోని ఇళ్లకు; బొప్పూడి, మురికిపూడిలోని పరిశ్రమలకు.
నాదెండ్ల మండలం: గణపవరం, వేలూరు రోడ్డు, గణపవరం నుంచి తిమ్మాపురం జాతీయ రహదారి, కొత్త బైపాస్ రోడ్, కనపర్రు, మైనంపాడు, సాతులూరు, చందవరం గ్రామాలకు.
యడ్లపాడు మండలం: మండలంలోని అన్ని గ్రామాలకు.
ఈ విద్యుత్ అంతరాయం గృహ, వ్యవసాయ, వాణిజ్య, చిన్న, భారీ పరిశ్రమలకు వర్తిస్తుంది. వినియోగదారులు సహకరించాలని చిలకలూరిపేట విద్యుత్ శాఖ డీఈఈ ఆర్.అశోక్ కుమార్ కోరారు.