గణపవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు పల్టీలు కొట్టిన కాలేజీ విద్యార్థుల కారు
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం సమీపంలో క్ గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట నుంచి కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు రెండు పల్టీలు కొట్టి రోడ్డు పక్కకు వెళ్లి పడిపోయింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కాలేజీ విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసి చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు

